Monday, July 19, 2010

దుర్భేద్యమయిన కొట గండికోట

దక్షిణ భారత దేశంలోనే గొప్ప దుర్భేద్యమయిన కొట గా పలువురు ప్రఖ్యాత చరిత్రకారుల ప్రశంసలను అందుకున్న గండికోట కడప జిల్లా చారిత్రక విశిష్టతను దశదిశలా చాటుతోంది. విజయనగర సామ్రాజ్యపు సామంత రాజుల పాలనలో గండికోట సీమ కు రాజధాని కేంద్రంగా గండికోట విలసిల్లింది. సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచశత మహోత్సవాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో గండికోట ను గురించి తెలుసుకుందాం !
రాయలసీమ జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం ఇది. ఈ ప్రాంతంలో పరుచుకొని ఉన్న ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చిందట. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉండేదట. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్‌ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో మదిని పులకింజేసే సుందర దృశ్యాలను
గండికోట ఆవిష్కరిస్స్తోంది.
గండికోట... ఈ పేరు సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి సుపరిచితమే... ఎందుకంటే... గండికోట పేరు, ఇతివృత్తంతో ఎన్నో తెలుగు సినిమాలు తెరకెక్కాయి. కళ్యాణీ చాళుక్యుల నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తున్న ఈ కోట తనలో ఎన్నో చారిత్రక విశేషాలను దాచుకుంది. వృత్తాకారంలో ఉండే ఈ కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖ ద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుపరేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతుర్రసాకారంలోను, దీర్ఘ చతుర్రసాకారంలోను 40 బురు జులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పు తో బాట ఉంది.
కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్‌ జుమ్లా జామా మసీదును ఎంతో సుందరం గా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మినార్లు లాంటి ఎన్నో ముఖ్యమైన కట్టడాలు ఉన్నాయి. అంతేకాదు జైలు, రంగ్‌ మహల్‌ లాంటి కట్టడాలు వీక్షకులను మైమరిపిస్తాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు లాంటి చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం పర్యాకులను ఆశ్చర్యా నికి గురి చేస్తుంది. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలం లో ఇలాంటి నీటి సదుపాయం నిర్మించడం ఎలా సాధ్యపడిందనే విషయం ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది.
గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండే వట. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.
చరిత్ర...
దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన గిరి దుర్గమైన గండికోట దుర్గం చరిత్రలోకి చూస్తే... 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగము లో మొదలవుతుంది. గండికోట కైఫియత్‌ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర చే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియ మించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించాడు అని పేర్కొనబడింది. ఐతే ఇదే నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేకపోవడం గమనార్హం. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయ కుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావి స్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామం తుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రు డు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించ డానికి నియమించాడని తెలుస్తోంది.
గండికోట విజయ నగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాం తము) లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మ సాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయు డు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు. విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు, పదిహే డవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్‌ షా సేనాని మీర్‌ జుమ్లా కుమార తిమ్మానాయునికి మం త్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.
గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్న ఈ కోటకు... పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల గండికోట అని పేరు వచ్చిందని చెబుతారు. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసి న కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి.
మాధవరాయ ఆలయం:
మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మా ణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది.
ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీ తుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలం లో) నిర్మించినట్లు చెప్పవచ్చు.
రంగనాథాలయం:
ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.15వ శతాబ్దంలో నిర్మిం చినట్లు చెప్పవచ్చు.
చాళుక్యులు, విజయనగరరాజులు, పెమ్మసాని నాయకులు వంటి రాజుల పాలనలో వారికి జీవన శైలికి అద్దం పడుతున్న గండి కోట చారిత్రక కట్టడాలను ఒక్కసారైనా తిలకించాల్సిందే...

Read "Gandikota" book click the link below..

http://www.telugusociety.blogspot.in/2013/02/blog-post_24.html

No comments:

Post a Comment